15, జనవరి 2010, శుక్రవారం

తీయని పీట.....తీరని తీట....పిచ్చోళ్ళ పేట!

తీయని పీట.....తీరని తీట....పిచ్చోళ్ళ పేట!



మొన్న ఏదో సందర్భంలో మా ఫ్రెండ్(ఆంగ్లం తో ఇదో వెసులుబాటండి,

 స్నేహితుడు,స్నేహితురాలు అని వివరించి అనేక ప్రశ్నలకు తావివ్వకుండా

ఈ మాటంటే గోడవోదిలిపోతుంది ), నేను మా బాస్ మీద జోక్ వేస్తూ ఉంటె

 లక్ష్మి గణపతి ఫిలిమ్స్ అన్న రేంజిలో చెప్పండి మీ బాస్ వింటారు

అన్నారు.  అప్పట్నుంచి నాకీ కామిడి పోస్ట్ వేయాలని తెగ ఉబలాటంగా

ఉందండి! నవ్వడం నవ్వకపోవడం, అది మీ ఇష్టం.! నాకేం కష్టం! రండి

 విని.... ఏమైనా కండి!

          [[ప్పిచ్చోళ్ళ ప్పేట!]]   ప్పిచ్చి ప్పల్లయ్యా ఫిలిమ్స్ తీయని పీట....

తీరని తీట..... [[ప్పిచ్చోళ్ళ ప్పేట!]]
ర్రండి...వ్వీక్షించండి,,, ప్పిచ్చోళ్ళ పేట..! ప్పిచ్చోళ్ళ పేట! ప్ప్ప్పిచ్చ్చోళ్ళ

ప్పేట్ట!


ప్ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతూ... జనం కోసమని బహిరంగంగా

 అబద్దం చెప్పటమే కాక అత్యంత ధైర్యంగా మోసాలకు పాలప్డిన ర్రాజకీయ

 నాయకులు...

దేన్ట్లోనో వేలు పెట్టి మరింకేదో కనిపెట్టేసామని చంకలు గుద్దుకుని తత్తర్వాత

 పప్పులో కలేసామని తెలిసినా ఒప్పుకోలేని మీడియా ప్రముఖులూ...

ప్ప్రతి విషయ్యాన్నికి త్తీవ్రంగా స్ప్పందించి వ్వేర్రి గంగలు ఎత్తిపోయ్యే తిక్క

జనం....

ముఖ్య నాయకుని వధించిన అసలు హంతకులు ఈ హడావిడి చూసి


చేసుకున్న సంబరాలు.....

ఈ చిత్రంలో మీరు చూసిన చిత్రాలు.


తమంతట తామే డైలాగులు రాసుకుని, నటించేస్తుంటే ఎం చేయాలో దిక్కు

 తోచక దిక్కులు వెదుకుతూ పారిపోయిన వెర్రి డైరెక్టరు....వ్వేర్రి వ్వెంకయ్య

 దర్శకత్వం వహించిన చిత్రం [పిచ్చోళ్ళ ప్పేట్ట!]...


పలువురు ర్రాజకీయ నాయకులు ... కొందరు మీడియా

 ప్రముఖులూ..తామేమి తక్కువ కాదని నిరూపించుకున్న వెర్రి జనం...

స్వచ్చందంగా న్నయా పైసా రేమ్యునేరషన్ తీసుకోకుండా నటించినందుకు

 ఆనదం తట్టుకోలేక వెర్రెత్తి ఎర్రగడ్డలో చేరిన నిర్మాత...

ప్పిచ్చి ప్పుల్లయ్య ..... సమర్పించిన చ్చిత్రం [ప్పిచ్చోళ్ళ ప్పేట్ట!]...

తాను వ్రాసిన కధలో ఎవరు హీరోలో ఎవరు విలన్లో ఎవరు కామెడీ క్యారెక్టర్లో

తేల్చుకో లేక తిక్క పుట్టి తిక్కగా ప్రవర్తిస్తున్న ర్రచ్చయిత.... తిక్క బ్రహ్మ

 రచించని చిత్రం [పిచ్చోళ్ళ పేట!]....


ఈ చిత్రాన్ని ఓర్పుగా ప్రసారం చేసిన టి.వి.లకు ... తత్ఫలితాల కోసం

 అత్యంత సహనంగా ఎదురు చూస్తున్న మీకు....


నా శతకోటి వందనాలు.