6, జనవరి 2010, బుధవారం

అందం నిజంగానే ఆనందమేనా!



              నిజమైన అందం ఎందులో ఉందొ తెలుసా! చెప్తా వినండి


                  సున్నితమైన పూలని తొక్కే మృదువైన పాదాలలో కాదు!


     ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికే ముందడుగు వేసే పాదాలలోఉంది


                  పూలను త్రుంచే తామర రేకుల్లాంటి చేతుల్లో కాదు!


     అన్నార్తుల ఆకలి తీర్చేందుకు వెన్నుముక లేని చేతుల్లో ఉంది


                    ఉండిలేనట్లుండే సన్నని నడుములో కాదు!


తోటి వారి కోసం తన జీవితాన్ని సైతం లెక్క చేయక బిగించే నడుములో


 కన్నవారికి  కాదు, ఎవరికీ ఆపద కల్గినా కదిలే పొత్తికడుపు నరాల్లో ఉంది


        ఆధిపత్యం కోసం మ్రోగే శంఖం లాంటి కంఠoలో కాదు!


              దీనుల కోసం ద్వనించే గొంతులో ఉంది


            ఎవరినో  నిందించే దొండపండు వంటి పెదవులలో కాదు!


 ఎదుటి వారి గొప్ప దనాన్ని మనస్ఫూర్తిగా పొగడే పెదవులలో ఉంది


                     క్రోధంతో చూసే కలువరేకుల వంటి కన్నులలో కాదు!


                  కష్టాలో ఉన్నవారిని కరుణతో చూసే కన్నులలో ఉంది


              కోపంతో గీతలు పడే విశాలమైన నుదుటిలో కాదు!


                కష్టించి చేసే  పని వల్ల వచ్చే స్వేదంలో ఉంది,


 ఎదుటివారి గురించి మంచి మాత్రమె యోచించే మనసులో ఉంది."


                  అదే "  నిజమైన అందం"