31, డిసెంబర్ 2009, గురువారం

న్యూ ఇయర్ విషెస్

ఈ పదో సంవత్సరం పాడి పంటలతో, సుఖ సంవ్రుదులతో అందరికి సుభ దాయకం కావాలని , పది విధాల అందరికి మేలు చేయాలనీ కోరుతూ మీ
                                 మనోశ్రీ

పరిచియాలు ...ప్రభావాలు

పరిచియాలు ...ప్రభావాలు :
                      కొన్ని పరిచయాలు మన జీవితాన్ని ఒక మలుపు తిప్పుతై .
                      కొన్ని పరిచయాలు మన ఉనికిని మారుస్తాయి
                      కొన్ని పరిచయాలు మనల్ని మనం తెలుసుకునేలా చేస్తాయి
                      కొన్ని పరిచయాలు మన వ్యక్తిత్వాన్ని ఇనుమడింప జేస్తాయి
                      కొన్ని పరిచయాలు మన స్వభావాన్ని ప్రేరేపిస్తాయి
                      కొన్ని పరిచయాలు మనల్ని మనం తెలుసుకునేలా చేస్తాయి
                      కానీ అన్ని పరిచయాలు శాశ్వతం కాదు.
                      ఈ ఏడాది నాకు ఎదురైన, నన్ను సంసకరించిన
                      అన్ని పరిచయాలకు సర్వదా కృతఙ్ఞతలు తెలియజేస్తూ
                      ఆ పరిచయాలు శాశ్వత స్నేహ బంధాలు కావాలని అభిలషిస్తూ
                                                                                      మీ మనోశ్రీ  నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తోంది
                                                                                      మీ స్నేహ హస్తం కోరుతూ ....

పాపం ఆర్. టి . సి నా ..., కాదు! పాపం సామాన్యుడు !

పాపం ఆర్. టి . సి నా ..., కాదు! పాపం సామాన్యుడు !
       ఆవునండి మరి, ప్రతిదానికి  ఆర్.టి.సి మీద పడిపోయే మనం కాస్త ఆలోచించాలి. అది ప్రభుత్వ ఆస్తి అంటున్నాం . ప్రభుత్వం అంటే ఎవరో! ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం అనగానే కాంగ్రెస్ అంటారేమో! ఆగందాగది కాంగ్రెస్ కాదు, టిడిపి , అంతకన్నా కాదు మనమే అన్న విషయం అసలు మనకు గుర్తుందా? గుర్తుంటే ఇలా మన ఆస్తుల్ని మనమే ధ్వంసం చేసుకుంటామా! అన్ని వేల బస్సుల్ని అలా తగలేట్టుకున్తామా ! ఒకసారి ఆలోచించండి తమ్ముళ్ళు ఆ భారం ఎవరి మెడను చుట్టుకోనుందో  మన మెడకే , ఖచ్చితంగా మన మెడకే కాదంటారా!
           తమ్ముడు, ఈ రోజు నీకు మందు ఇచ్చిన వాడు రేపు చార్జీల తల భారం మోయడు, మోయడు. గుర్తుంచుకో. ఈ రోజు నీకు సరదాగానే ఉంటుంది రాయి బస్సు మీదికి విసురుతుంటే కాని వెనుకే చార్జీలు టాక్సుల రూపంలో పొంచివుంది పెద్ద ప్రమాదం మేలుకో చదువుకున్న మూర్ఖుడా!