11, జనవరి 2010, సోమవారం

నా దృష్టిలో మిస్ యూనివర్సులు, మిస్టర్ హ్యాండ్సంలు

మొన్న ఎడిటింగ్ చేసి చేసి విసుగొచ్చి వదిలేసానండి దానికి కొనసాగింపు....!


నా దృష్టిలో మిస్ యూనివర్సులు, మిస్టర్ హ్యాండ్సంలు:


      మదర్ థెరిస్సా, నైటింగేల్, ఒక విజయ, ఒక బాబురావు, ఒక రామకృష్ణ, గాంధి, ఠాగూర్,

 విజయ: జీవితంలో తానోడిపోయి, తిరిగి చేజిక్కించుకుని ఇపుడు తనలా

జీవితాన్ని కోల్పోయిన మహిళలను ఒక ఆధారం దొరికే వరకు ఆదుకుంటున్న 

మహిళా శిరోమణి.


 రామకృష్ణ: తాను కుంటివాడుగా పడుతున్న బాధలు వేరొకరు భరించడం

ఇష్టం లేక జైపూరు సంస్థకు తను గుడి దగ్గర చెప్పులు చూసుకున్నందుకు భక్తులు

ఇచ్చే డబ్బులు విరాళంగా ఇస్తున్నారు. ఈ విషయం తెలిసిన నేను మొదట

సిగ్గుపడ్డాను యాచక వృత్తిలో ఉంటూ నిలువ నీడ లేని ఆయన అలా మానవ సేవకు

నడుం వంచితే మనం......

బాబురావు: ఒక ఇరాని కేఫ్ యజమాని అతి కష్టం మీద జీవితంలో పైకెదిగి,

కాన్సెర్ హాస్పిటల్లో రోగులకి కావలసిన సదుపాయాలన్నీ సమకూర్చుతున్న

దయాళువు.

ఇలాంటి ఎందరినో మనకు శ్రీ కందుకూరి రమేష్ గారు తన రచనల ద్వారా

పరిచయం చేసారు, చేస్తూనే ఉంటారు. ఆయన రచనల కోసం

 www.samanyashastram.com ను ఓపెన్ చేసి చదవండి 

(ఆసక్తి ఉన్నవారు).

 అదండీ సంగతి! దేశం , రాష్ట్రం, మీడియా , జర్నలిజం, వీటన్నిటితో పాటు మధ్యలో

 బ్లాగర్ల గొడవలు కాస్త పక్కన పెట్టి,

ప్రశాంతంగా ఈ వెబ్సైటు చూసి కాస్త మానవత్వం ఉన్న వాళ్ళను తెలుసుకుని , 

 అన్నట్లు ఈ రచయిత వ్రాసిన డోంట్ ఫీల్ చదవండి అందరు దేని గురించైనా మనిషి

అసలు ఏ విధంగా స్పందించాలో ఈ పుస్తకంలో ఉంటుంది అర్థం చేసుకునే నేర్పుంటే

చదవగలరు ఇది మనవి మాత్రమె

నా దృష్టిలో మిస్ యూనివర్సులు, మిస్టర్ హ్యాండ్సంలు

మొన్న పదే పదే ఎడిటింగ్ చేసి చేసి విసుగొచ్చి ససేషంగా ఆపానండి దానికి కొనసాగింపు.....
నా దృష్టిలో మిస్ యూనివర్సులు, మిస్టర్ హ్యాండ్సంలు:
                    ఒక మదర్ థెరిస్సా, ఒక నైటింగేల్, గాంధి, టాగూర్, ఒక విజయ, ఒక రామకృష్ణ