మత వ్యత్యాసం ఎరుగని,
కుల తత్త్వం తెలియని ,
జాతి భేదం లేని ఓ... బాల్యమా తిరిగి రావా...!
మానుషత్వానికి,
అమానుషత్వానికి,
ఒకేలా స్పందించిన
అమాయకపు బాల్యమా తిరిగి రావా...!
స్వార్ధాన్ని, ఔన్నత్యాన్ని
భేదించలేని నిర్మలత్వమా
నా బాల్యమా ....తిరిగి రావా...!
ప్రెమనూ , ద్వేషాన్ని
చిరునవ్వుతో ఆహ్వానించే
ప్రియ బాల్యమా...తిరిగి రావా...!
నిస్వార్ధమై, నిశ్చలమై
నిరాకాన్తమై నిలిచిన
బాల్యమా తిరిగి రావా...!
స్వార్ధ పరులైన పెద్దల క్రియలకు
సాక్షీభూతమై నిలిచిన
నిస్వార్ధ హృదయ బాల్యమా...!
కౌమారపు తలపులు
మదినిండగా కనుమరుగైన
బాల్యమా తిరిగి రావా....!
యవ్వనపు కాంక్షల
నడుమ నలిగిపోయి, అణిగిపోయిన
బాల్యమా తిరిగి రావా...!
స్వార్ధమే చింతయై
అశాంతియే హేయమైన
పెద్దరికపు చేష్టలచే
చంపబడిన ఓ... బాల్యమా...
ఒక్క......సారి, ఒకే...ఒక్క...సారి
తిరిగి రావా............................!
(నాది అనవసర ప్రయాసే అనుకో, ఐన... ఒకసారి తిరిగి రావా....!)