2, ఏప్రిల్ 2010, శుక్రవారం

టైటిల్ ఏమి లేదు

టైటిల్ ఏమి లేదు
                        ఏం చేయమంటారు మరి కామెంట్ చేయటానికి వీలు లేదాయే ఏమైందో ఏమోనండి!

చివరికి నా బ్లాగ్లో నేను కూడా కామెంట్ పెట్టలేకపోతున్న.

                        ఆ ఏమంటారు మొన్న కాస్త ఎదుటి వారి గురించి మంచి మాత్రమె మాట్లాడండి అంటే నన్ను
అంతగా ఆడి పోసుకుంటారా  ఎమన్నా న్యాయంగా ఉందా నేనలిగాను.

                         సరే విషయానికొస్తా చాల మంది నేను ఏదో మూడ్లో ఉంది వ్రాసానని కొందరు నన్నెవరో ఏదో అంటే
నేను బాధలో ఉంది వ్రాసానని అన్నారు.

                         అదేమీ కాదండి నేను ఉన్న మాటే అన్నాను. ఉదాహరణకు మన వీధి చివర అమ్మాయి ప్రేమించి

ఎవరితోనో వెళ్లిపోయింది అనుకోండి వెంటనే మనలో జరిగే రియాక్షన్ ఏమిటి ఒకసారి గుర్తుచేసుకోండి ఎలా

ఉంటుందో మన మీద మనకే సిగ్గుగా ఉంటుంది కదా బాధలో ఉన్న ఆ తల్లిదండ్రుల్ని ఒదార్చల్సింది పోయి ఇంకో

  నాలుగు మాటలని బాధ పెడతాము.

                          ఇంతకూ నేను చెప్పేదేమిటి అంటే గాంధి గారు చెడు అనకు అంటే ఇతరుల్ని గురించి చెడు

విమర్శ చేయొద్దని కాని, బయట ఏం జరిగినా నాకేమిటి అని మాట్లాడకుండా ఉండమని కాదు, ఎవరికైనా కష్టం

కలిగినపుడు తప్పించుకు పొమ్మని కాదు గాంధీగారు చెడు మాట్లాడోద్దన్నారు కాని, మంచి మాట్లాడొద్దు అనలేదుగా!

                           చెడు చేయకు మన మాటల ద్వారానో చేతల ద్వారానో ఎదుటి వారికి చెడు చేయొద్దు అన్నారు

కాని, ఎదుటి వారికీ మంచి చేయొద్దు అనలేదుగా!

                           చెడు వినకు ఎవర్ని గురించో ఎవరో విమర్శిస్తుంటే వినోద్దని కాని ఎదుటి వాళ్ళు వాళ్ళ బాధలు

చెప్పుకుంటే వినోద్దని కాదుగా విని చిన్న మాట సాయం చేస్తే తప్పేమిటి?

                           అసలు గాంధి గారు ఏమి చేయకూడదో కాకుండా ఏమి చేయాలో చెప్పి ఉండాల్సింది మంచి

మాట్లాడు , మంచి చేయి, మంచి విను ఇలా

                           ఇంతకు నా సారంసమేమిటంటే మనకు ఎదుటి వ్యక్తి లో చెడు కనిపిస్తే అది చూడకండి ప్రతి

వ్యక్తిలోనూ మంచి చెడులు రెండు సమానంగా ఉంటాయి. మంచి మాత్రమె చూస్తె ఆ మనిషి లో చెడు కుడా

పోతుంది నిజం చేసి చూడండి!


                           సద్విమర్శ మనిషిని ఉత్సాహ పరిస్తే, దుర్విమర్స మనిషిని కృంగదీస్తుంది.  ఈ రోజు ఎదుటి

మనిషి అనుభావస్తున్న దుర్వ్యవస్థ రేపు మనక్కూడా అన్భావంలోకి రావొచ్చు లేదా మనం గతంలో అనుభవించి

దాటి తర్వాత ఆ రోజుల్ని మరిచి ఈరోజు ఎదుటి వాళ్ళను విమర్శించోచ్చు.