5, ఫిబ్రవరి 2010, శుక్రవారం

ఈర్శాసూయలకు లింగ బేధం లేదు అవి చూపించే విధానంలోనే ఉంది!

ఈర్శాసూయలకు లింగ బేధం లేదు అవి చూపించే విధానంలోనే ఉంది!

                 అవునండి! ఆడవాళ్ళకి  ఈర్శాసుయలను పట్టం కట్టారు కాని

మగవాళ్లందుకు ఏ మాత్రం తీసిపోరని ఈ క్రింది సంఘటన నిరూపిస్తుంది:



      హైదరాబాద్లోని బాల్నగర్ సిగ్నల్ దగ్గర ఒక

మూగవాడు ఈర్శాసూయలకు గురైన తీరిది!

బాల్నగర్ నుంచి కూకట్పల్లి వెళ్ళుటకు సర్వీసు ఆటోలు సిగ్నల్

 దగ్గర దొరుకుతాయి అక్కడ ఈ మూగవాడు ఒక ఆటో తర్వాత ఒక ఆటో

లో మనల్ని పిలిచి ఎక్కిస్తాడు.

అతడు ఈ పని చేయడానికి ఖైరతాబాద్ నుండి వస్తాడుట.

ఇతని గురించి చెప్పేముందు బాల్నగర్

ట్రాఫిక్ ఎలా ఉంటుందో చెప్పాలి మీకు మీరు ఏ టైములో వెళ్ళినా

కూడా సుమారు ఒక రెండు కిలోమీటర్లు దాక వాహనాలు నిలిచి ఉంటాయి.

అంతటి ట్రాఫిక్ లో యితడు చేసే పని నన్నాకర్షించింది.

               అతని గురించి వివరాలడిగి తెలుసుకున్నాను అతనొక

మూగవాడని చాల దూరం నుంచి వస్తాడని అద్దాలు తుడిచి రెండు

రూపాయలు అడిగి తెసుకునే వాడని చెప్పారు.

               ముందు అతన్ని ఆటో వాళ్ళు బాగానే మెచ్చుకున్నారు.

            నాకు మాత్రం అతడు ఇక్కడి ట్రాఫిక్ ఈ సిగ్నల్ దగ్గర ఉండవలసిన

వ్యక్తి అనిపించింది. అతడు మాకు అంటే ఆటోవాళ్ళకు, ఎక్కేవాళ్ళకు, ట్రాఫిక్

పోలీసు యంత్రాంగానికి కూడా ఎంతో మేలు చేస్తున్నాడనిపించింది.

          ఇతను చేసే సేవ గురించి ఒక టి.వి  ఛానల్ వారికి చెప్పాను.

వాళ్ళు అతని గురించి విచారించడానికి వచ్చిన రెండు సార్లు అతను లేడు.

మేము ఆటో వాళ్ళని అతని వివరాలడిగి తెలుసుకున్నాం.

తర్వాత ఆ ఛానల్ జర్నలిస్ట్ అతని గురించి పూర్తి వివరాలు అడిగి

తెలుసుకుని ఇతని గురించి ఒక ప్రోగ్రామ్

ప్రసారం చేద్దామనుకుని నిర్ధారణకు వచ్చారు. ఎందుకో ఆ పని

కొన్ని రోజులు వాయిదా పడింది.

       ఇదిగో అపుడు మొదలైంది ఆటోవాళ్ళలో

అలజడి ఎంటండి వాడి గొప్ప మొన్న టీవీ వాళ్ళు

కూడా ఎవరో వొచ్చి అడిగారు! అడుక్కునే వాడండి వాడు అద్దాలు తుడిచి

డబ్బులు అడుక్కుంటాడు చూసే వాళ్ళు ట్రాఫిక్

కంట్రోల్ చేస్తున్నాడు అనుకుంటారు అన్నారు .  మరి అతన్ని

ఎమన్నా భయపెట్టారో ఏమో ఈ ఆటో వెధవలు ; అతను

రావడం మానేసాడు.

                అందుకు తగ్గ ఫలితం ఆటోవాళ్ళు అనుభవిస్తున్నారు  అనుకోండి.

ఏముంది అతను లేకపోయే సరికి అక్కడ ఆటో వాళ్ళు ఎలా

పడితే అలా ఆటోలు నిలబెట్టడం వల్ల ట్రాఫిక్ సిబ్బంది  విసుగు

చెంది ఆటోలను నిలవనీయడం లేదు. ప్రయాణికులకు కూడా

ఇబ్బందే అనుకోండి కాని నాకు మాత్రం నా అత్యుత్సాహం ఒక

మూగవాడి నోటి దగ్గరి కూడు లాగేసింది అనిపించింది.


ఇంతకూ నేను చెప్పొచ్చేదేమిటంటే ఆడవాళ్ళ  ఈర్శాసూయలు 

మూతి ముడుచుకోవడం మొహం

మాడ్చుకోవడం వరకే ఉంటె మగవాళ్ళ ఈర్శాసూయలు ఇలా

ఎదుటివాళ్ళ వెనుక గోతులు తీసేలా ఉంటాయి అన్నమాట!


  • నేనొకసారి అతను చేసే పని నచ్చి 2 రూపాయలు చేతిలో పెట్టబోతే తీసుకోలేదు ఏమిటని అడిగితె అతను అడుక్కునే వాడు కాదు అలా చేస్తే కోపగించుకుంటాడని ఆటో వాళ్ళే చెప్పారు నాకు  ముందు