7, ఏప్రిల్ 2010, బుధవారం

చిన్న సహాయం!

చిన్న సహాయం!
                    మా పొరిగింటి వారబ్బాయి  చేసిన చిన్న మాట సాయం తరువాత అతను పొందిన తృప్తి గురించి చెప్తే
ఎవరైనా తెలుసుకుంటారు సహాయం చేయడంలోని తృప్తి ఏమిటో!
                     ఒకసారి అతను బస్సులో వెళుతుంటే ఒకావిడ చేతినిండా ఒకరకమైన ఎలర్జీ ఉందిట. ఈ బాబు చూసి చూసి
మొదట సంకోచించినా తరువాత ఆమె ఏమనుకుంటే ఎమిలే అని మీ చేతికి వచ్చిన ఎలేర్జీ లాంటి వాటికి చికిత్స చేయించుకుంటున్నార అని అడిగాడుట. చేయించుకున్నా కాని కాస్ట్లీ మెడిసిన్ వల్ల ఇక మానేసా అందిట.
                     వెంటనే ఆ పిల్లాడు ఇలాంటి వాటికి క్రిస్టియన్ మశినరీస్ లో ఉచితంగా విడయం చేస్తారు అని చెప్పాడుట ఇంతలో ఆవిడ దిగే స్టేజీ వచేస్తే హడావిడిగా తన నెంబర్ ఇచ్చి ఫోన్  చేయండి అడ్రెస్స్ చేప్తానన్నాడుట ఆవిడ ఫోన్ చేసి అడ్రెస్స్ అడిగితె వివరంగా చెప్పాడుట ఆమె పేరు కుడా తెలుసుకోలేదుట.
                      నెల తర్వాత ఆమె ఫోన్ చేసి చాల చాల థాంక్స్ బాబు నాకు తగ్గిపోయింది అని చెప్పిందిట. అపుడు అతను పొందిన తృప్తి ఇంకేపుడు పొంద లేదుట. విషయం ఏమిటంటే ఆ ఆనందంలో అతను మల్లి ఆమె పేరు తెలుసుకోవడం మర్చిపోయాదుట. పేరులో ఏముందిలే నీ వల్ల ఆ అమ్మాయి వ్యాధి నయమైంది అన్నాను! నిజామేనంటారా !