11, జనవరి 2010, సోమవారం

నా దృష్టిలో మిస్ యూనివర్సులు, మిస్టర్ హ్యాండ్సంలు

మొన్న ఎడిటింగ్ చేసి చేసి విసుగొచ్చి వదిలేసానండి దానికి కొనసాగింపు....!


నా దృష్టిలో మిస్ యూనివర్సులు, మిస్టర్ హ్యాండ్సంలు:


      మదర్ థెరిస్సా, నైటింగేల్, ఒక విజయ, ఒక బాబురావు, ఒక రామకృష్ణ, గాంధి, ఠాగూర్,

 విజయ: జీవితంలో తానోడిపోయి, తిరిగి చేజిక్కించుకుని ఇపుడు తనలా

జీవితాన్ని కోల్పోయిన మహిళలను ఒక ఆధారం దొరికే వరకు ఆదుకుంటున్న 

మహిళా శిరోమణి.


 రామకృష్ణ: తాను కుంటివాడుగా పడుతున్న బాధలు వేరొకరు భరించడం

ఇష్టం లేక జైపూరు సంస్థకు తను గుడి దగ్గర చెప్పులు చూసుకున్నందుకు భక్తులు

ఇచ్చే డబ్బులు విరాళంగా ఇస్తున్నారు. ఈ విషయం తెలిసిన నేను మొదట

సిగ్గుపడ్డాను యాచక వృత్తిలో ఉంటూ నిలువ నీడ లేని ఆయన అలా మానవ సేవకు

నడుం వంచితే మనం......

బాబురావు: ఒక ఇరాని కేఫ్ యజమాని అతి కష్టం మీద జీవితంలో పైకెదిగి,

కాన్సెర్ హాస్పిటల్లో రోగులకి కావలసిన సదుపాయాలన్నీ సమకూర్చుతున్న

దయాళువు.

ఇలాంటి ఎందరినో మనకు శ్రీ కందుకూరి రమేష్ గారు తన రచనల ద్వారా

పరిచయం చేసారు, చేస్తూనే ఉంటారు. ఆయన రచనల కోసం

 www.samanyashastram.com ను ఓపెన్ చేసి చదవండి 

(ఆసక్తి ఉన్నవారు).

 అదండీ సంగతి! దేశం , రాష్ట్రం, మీడియా , జర్నలిజం, వీటన్నిటితో పాటు మధ్యలో

 బ్లాగర్ల గొడవలు కాస్త పక్కన పెట్టి,

ప్రశాంతంగా ఈ వెబ్సైటు చూసి కాస్త మానవత్వం ఉన్న వాళ్ళను తెలుసుకుని , 

 అన్నట్లు ఈ రచయిత వ్రాసిన డోంట్ ఫీల్ చదవండి అందరు దేని గురించైనా మనిషి

అసలు ఏ విధంగా స్పందించాలో ఈ పుస్తకంలో ఉంటుంది అర్థం చేసుకునే నేర్పుంటే

చదవగలరు ఇది మనవి మాత్రమె

10 కామెంట్‌లు:

  1. అజ్ఞాతజనవరి 11, 2010

    ఈ వెబ్ సైటును గురించి తెలియజేసినందుకు కృతజ్ఞతలు. చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  2. అజ్ఞాతజనవరి 11, 2010

    thanks mr.ravichandra, na postnu chadavina ventane website nu veekshinchinanduku

    రిప్లయితొలగించండి
  3. మనోశ్రీ గారు, మీ అభిప్రాయాలు చాలా బాగున్నాయి. మనిషిలో మానవత్వం లేకపోతే...ఏదున్నా...ఎన్నున్నా..ఒకటే. అందరూ అలా మారగలిగిన నాడు...అసలైన అభివృద్ధి కనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి
  4. ఒక మంచి సైటు ను పరిచయం చేశారు. ధన్యవాదములు. మీ సిస్టంలో లేఖిని పని చేయకపోతే మీరు ఇది కూడా ఒక్కసారి ప్రయత్నించండి.
    http://www.google.com/transliterate/indic/Telugu

    రిప్లయితొలగించండి
  5. ఈయన కౌముది ప్రారంభించిన కొత్తలో "అసామాన్యులు" అనే పేరుతో శీర్షిక ఈ వ్యక్తులని పరిచయం చేసేవారు. గత సంవత్సరం నుండి ఆ శీర్షిక రావడం లేదు, ఎందుకో ఆపేసినట్టున్నారు. రమేష్ గారి వెబ్సైట్ లింక్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  6. అజ్ఞాతజనవరి 11, 2010

    ఏముందండి బద్రి గారు మంచి విషయాలు చెప్తే వినడానికి ఎవరు ఇష్టపడతారు ఎపుడు ఎవరినో విమర్శ మాత్రమె ఇష్టపడే మనం., ఇన అలుపెరుగక ఇతరుల గురించి మంచి మాత్రమె ప్రచారం చేస్తున్నారీ రచయిత. ధన్యవాదాలు.
    శిశిర గారు మీరు నాకు ఈ లింక్ ను తెలియజేసినందుకు ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  7. మంచి టపా వేసారు ... అభినందనలు

    రిప్లయితొలగించండి
  8. మంచి పరిచయం చేసారు. తప్పకుండా ఆ రచనలు చదువుతాను. చదివాక మళ్లీ వచ్చి ఇక్కడ నా అభిప్రాయం చెప్తాను.

    రిప్లయితొలగించండి