30, జనవరి 2010, శనివారం

భవిష్యత్ హరివిల్లు ఇదేనేమో!

భవిష్యత్ హరివిల్లు

ఇదేనేమో!


  మొన్న మా పిల్లలు టి.వి లో హరి విల్లు చూసి ఉప్పొంగి పోతున్నారు

నాకు మాత్రం నా పిల్లల్ని చూసి జాలి వేసింది. వాళ్ళ సంబరం చూసి

బాధ కలిగింది. ఎందుకో మీకు ఇమేజ్ చూసి అర్థమైఉంటుంది.
       

 మేము చిన్నపుడు కనీసం మూడు సార్లైనా సహజమైన ఇంద్రధనస్సుని

తిలకించి అబ్బుర పోయే వాళ్ళం. విచిత్రమేమిటో తెలుసా

మా సంబరం చూసి మా అమ్మ వాళ్ళు జాలి పడే వాళ్ళు మేము

వర్షాకాలం వెళ్లి సీతాకాలం వచ్చే రోజుల్లో ప్రతిరోజూ

చూసేవారమని చెప్పేవారు
      

ఇంతలో మా అమ్మమ్మ అందుకుని ఏమిటో అతిశయం మేము ప్రతి రోజు

చూసే వాళ్ళం మీకు ఆ అదృష్టం ఎక్కడిది కలికాలం అని మూతి

విరిచేది.
     

         నిజమే! కలికాలమే ఏది సహజత్వం, ఎక్కడుందది? ఎపుడో

మటుమాయమైంది,(మనిషిలో మానవత్వం, మంచితనం లాగానే).
      
నా పిల్లలకి అందకుండా పోయింది. నా పిల్లల పిల్లలకది ఎప్పటికి అందని

ద్రాక్షానే ఏమో!

       

ఇంతకూ నేను కొన్నిసార్లైన చూసిన సహజమైన హరివిల్లిదిగో

      

3 కామెంట్‌లు:

  1. మావైపు వర్షాలు తక్కువైనా చిన్నప్పుడు నేను కూడా బాగానే ఎంజాయ్ చేశాను ఇంధ్రధనుస్సును చూసి. అంటే మాకు దూరంగా ఏదో ఒక ఊర్లో వర్షాలు పడుతుంటాయి కదా. అలాగన్నమాట. :))

    హరివిల్లు X ఇంధ్రధనుస్సు ???

    విల్లు=ధనుస్సు ok
    హరి=ఇంధ్ర ??? I have a doubt here

    హ్మ్... వెంటనే ఈ విషయమై బ్లాగ్లోకంలో చర్చ(రచ్చ)కు తెరదీయాలి. :)))

    రిప్లయితొలగించండి
  2. అజ్ఞాతజనవరి 30, 2010

    చాలా బాగుందండీ ఫోటో....నేను చాలాసార్లు చూశాను చిన్నప్పుడు...

    రిప్లయితొలగించండి
  3. మన పెద్దలనాటి ఆనందం మనకు లేదు. మనకాలం నాటి ఆనందాలు మన పిల్లలకు లేదు. ఇకముందు ఏమో అంతా కృత్రిమమే కావొచ్చు. ఇంద్రధనస్సు బాగుంది.

    రిప్లయితొలగించండి