25, ఫిబ్రవరి 2010, గురువారం

ఎదుటి వారిని ప్రశంసించడం అంటే పచ్చి వెలక్కాయ తిన్నట్లుగా భావిస్తారు వీళ్ళు !



అవునండి! మనలో చాల మంది ఎదుటి వారి గురించి మంచి మంచి

మాట్లాడాలంటే వాళ్ళ నోర్లు కట్టేసినట్లు , గుండె పిండేసి నట్లు భావిస్తారు! అంతే వెంటనే అనేస్తారు ఆ ఏముంది అందులో విశేషం అని.

         ఉదాహరణకు మనం మన కర్ణుడి నీ కూడా కవచ కుండలాలు దానం చేయక పొతే ఆ ఆయన గొప్ప ఏముంది స్నేహితుడిచ్చాడు పెడుతున్నాడు ఆయన జేబు నుండి పెట్టట్లేదుగా అని. అంటే ఎవరి గోప్పదనాన్నైన తెలుసుకోవాలంటే తప్పని సరిగా ఇంకో మనిషి చెడ్డవాడవాలనమాట అపుడు కాని గుర్తించలేమా!

      అదే ఎవరినైనా విమర్శ అనండి అబ్బ ముందసలు ఆ సందర్భం రావడం ఆలస్యం కళ్ళు కోటి రతనాల కాన్తులౌతాయి అందరికి కాదంటారా!
       కాని ఎదుటి వారి గురించి మంచి మాట్లాడినపుడు మన మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంటుందో!  చెడు మాట్లాడినపుడు తాత్కాలికంగా సేద తీరోచ్చు కాని ఆ తర్వాత ఎంత అలజడికి గురౌతామో ఎంత అశాంతి ఎదుర్కుంటామో మనకే తెలుసు ఐనా మన నడవడిక మార్చుకోము ఎందుకని?
        అంతేకాదు చాల మందికి తెలియని విషయం ఏమంటే మంచి మాత్రమె అలోచించి మంచి మాత్రమే చేసే వాళ్ళు B P  , షుగర్ , అల్సర్ , గుండె పోటు ఇవన్నిటి నుంచి దూరంగా ఉండొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు.


       ఒకసారి ప్రయత్నించి చూడండి తప్పు లేదు!  ఎందుకంటే తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు కదా అందుకు
        ఎదుటివారి గురించి మంచి మాట్లాడండి మీ గురించి చెడు మాట్లాడిన వాళ్ళ గురించి పట్టించుకోకండి!
      ఏమంటారు సరే అంటారా నాతొ ఏకీభవిస్తారా

5 కామెంట్‌లు:

  1. కానీ ఇది "నువ్వు నన్నూ నా పని గొప్పతనన్నీ పొగుడు నేను నిన్నూ నీ పని గొప్పతనాన్నీ పొగుడుతాను" అనే మాచ్ ఫిక్సింగ్ ధోరణికి మారకుండా ఉంటే మంచిది. మన ఆఫీసుల్లో ఇదే రకమైన టెక్నిక్ తో ఉద్యోగంలో ఎదిగే వాళ్ళున్నారు మరి!

    రిప్లయితొలగించండి
  2. chee... em post idi .. em baaleadu... entaaa topic.. ee concept enti... asalemaina meaning undaa...

    cheee


    cheee cheee

    (chee)n

    రిప్లయితొలగించండి
  3. మరి ఈ టపాలో మీరూ ఎవర్నో విమర్శిస్తున్నారుగా :-)

    రిప్లయితొలగించండి
  4. ఛీ..! బ్లాగాధమా! ( ఎలావుంది కొత్త తిట్టు? ) :))

    Sankar

    రిప్లయితొలగించండి
  5. మీరేదో మూడ్‌లో ఉండి రాసినట్టుగా ఉంది. ఇంతకుముందు పోస్టుల్లా లేదు. ఏమీ బాగాలేదు.

    రిప్లయితొలగించండి