మత వ్యత్యాసం ఎరుగని,
కుల తత్త్వం తెలియని ,
జాతి భేదం లేని ఓ... బాల్యమా తిరిగి రావా...!
మానుషత్వానికి,
అమానుషత్వానికి,
ఒకేలా స్పందించిన
అమాయకపు బాల్యమా తిరిగి రావా...!
స్వార్ధాన్ని, ఔన్నత్యాన్ని
భేదించలేని నిర్మలత్వమా
నా బాల్యమా ....తిరిగి రావా...!
ప్రెమనూ , ద్వేషాన్ని
చిరునవ్వుతో ఆహ్వానించే
ప్రియ బాల్యమా...తిరిగి రావా...!
నిస్వార్ధమై, నిశ్చలమై
నిరాకాన్తమై నిలిచిన
బాల్యమా తిరిగి రావా...!
స్వార్ధ పరులైన పెద్దల క్రియలకు
సాక్షీభూతమై నిలిచిన
నిస్వార్ధ హృదయ బాల్యమా...!
కౌమారపు తలపులు
మదినిండగా కనుమరుగైన
బాల్యమా తిరిగి రావా....!
యవ్వనపు కాంక్షల
నడుమ నలిగిపోయి, అణిగిపోయిన
బాల్యమా తిరిగి రావా...!
స్వార్ధమే చింతయై
అశాంతియే హేయమైన
పెద్దరికపు చేష్టలచే
చంపబడిన ఓ... బాల్యమా...
ఒక్క......సారి, ఒకే...ఒక్క...సారి
తిరిగి రావా............................!
(నాది అనవసర ప్రయాసే అనుకో, ఐన... ఒకసారి తిరిగి రావా....!)
ఎంత బాగుందండి! నిజంగా బాల్యం తిరిగొస్తే ఎలా ఉంటుందంటారు. ఇప్పుడు అన్నీ తెలిసి వెనక్కి ఆ బాల్యానికి పోతే అంత అమాయకత్వం, ఆ ఆనందం ఉంటుందంటార!
రిప్లయితొలగించండిజయ గారు మీరు నా బ్లాగును ఫాలో అవుతూ నన్ను ప్రోత్సహిస్తున్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. నిజమె అన్నీ తెలిసాక బాల్యం తిరిగి వస్తే బావుండదు. అందుకె, ఆ బాల్యం లోని నిర్మలత్వన్ని, నిస్వార్థాన్ని, క్షమాగుణాన్ని , అలాగె నాతో ఉండిపొమ్మని ప్రదేయపడుతున్నా.
రిప్లయితొలగించండిబాగుంది బాల్యమా తిరిగి రావా
రిప్లయితొలగించండి