6, జనవరి 2010, బుధవారం

అందం నిజంగానే ఆనందమేనా!



              నిజమైన అందం ఎందులో ఉందొ తెలుసా! చెప్తా వినండి


                  సున్నితమైన పూలని తొక్కే మృదువైన పాదాలలో కాదు!


     ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికే ముందడుగు వేసే పాదాలలోఉంది


                  పూలను త్రుంచే తామర రేకుల్లాంటి చేతుల్లో కాదు!


     అన్నార్తుల ఆకలి తీర్చేందుకు వెన్నుముక లేని చేతుల్లో ఉంది


                    ఉండిలేనట్లుండే సన్నని నడుములో కాదు!


తోటి వారి కోసం తన జీవితాన్ని సైతం లెక్క చేయక బిగించే నడుములో


 కన్నవారికి  కాదు, ఎవరికీ ఆపద కల్గినా కదిలే పొత్తికడుపు నరాల్లో ఉంది


        ఆధిపత్యం కోసం మ్రోగే శంఖం లాంటి కంఠoలో కాదు!


              దీనుల కోసం ద్వనించే గొంతులో ఉంది


            ఎవరినో  నిందించే దొండపండు వంటి పెదవులలో కాదు!


 ఎదుటి వారి గొప్ప దనాన్ని మనస్ఫూర్తిగా పొగడే పెదవులలో ఉంది


                     క్రోధంతో చూసే కలువరేకుల వంటి కన్నులలో కాదు!


                  కష్టాలో ఉన్నవారిని కరుణతో చూసే కన్నులలో ఉంది


              కోపంతో గీతలు పడే విశాలమైన నుదుటిలో కాదు!


                కష్టించి చేసే  పని వల్ల వచ్చే స్వేదంలో ఉంది,


 ఎదుటివారి గురించి మంచి మాత్రమె యోచించే మనసులో ఉంది."


                  అదే "  నిజమైన అందం"  

6 కామెంట్‌లు:

  1. బాగుంది. మొత్తానికి మీరు, మీ మనసు కూడా అందంగా ఉంటారన్న విషయం తెలిసింది. :):)

    రిప్లయితొలగించండి
  2. అందం గురించి చాలా అందం గా చెప్పారు.

    రిప్లయితొలగించండి
  3. అవును, మీరు చెప్పాలనుకున్నది నాకర్ధమైంది. చాలా బాగా రాశారు. పై వ్యాఖ్య లో కూడా ఇదే చెప్పాను. నా వ్యక్తీకరణలో లోపమేమో. :)

    రిప్లయితొలగించండి
  4. అజ్ఞాతజనవరి 07, 2010

    no, no your wording is good sisira madum

    రిప్లయితొలగించండి
  5. మీ కవిత లో అందమైన ఆనందం కనిపించింది. మానసిక త్రుప్తే నిజమైన అందం...అనందం. మానవత్వాన్ని మించిన తృప్తి ఇంకేది. మనిషి వ్యక్తిత్వమే మనసులోని అందాన్ని చూపిస్తుంది.

    రిప్లయితొలగించండి
  6. అజ్ఞాతజనవరి 10, 2010

    Thankyou jaya. for encourasing and supporting my words.

    రిప్లయితొలగించండి