31, డిసెంబర్ 2009, గురువారం

పాపం ఆర్. టి . సి నా ..., కాదు! పాపం సామాన్యుడు !

పాపం ఆర్. టి . సి నా ..., కాదు! పాపం సామాన్యుడు !
       ఆవునండి మరి, ప్రతిదానికి  ఆర్.టి.సి మీద పడిపోయే మనం కాస్త ఆలోచించాలి. అది ప్రభుత్వ ఆస్తి అంటున్నాం . ప్రభుత్వం అంటే ఎవరో! ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం అనగానే కాంగ్రెస్ అంటారేమో! ఆగందాగది కాంగ్రెస్ కాదు, టిడిపి , అంతకన్నా కాదు మనమే అన్న విషయం అసలు మనకు గుర్తుందా? గుర్తుంటే ఇలా మన ఆస్తుల్ని మనమే ధ్వంసం చేసుకుంటామా! అన్ని వేల బస్సుల్ని అలా తగలేట్టుకున్తామా ! ఒకసారి ఆలోచించండి తమ్ముళ్ళు ఆ భారం ఎవరి మెడను చుట్టుకోనుందో  మన మెడకే , ఖచ్చితంగా మన మెడకే కాదంటారా!
           తమ్ముడు, ఈ రోజు నీకు మందు ఇచ్చిన వాడు రేపు చార్జీల తల భారం మోయడు, మోయడు. గుర్తుంచుకో. ఈ రోజు నీకు సరదాగానే ఉంటుంది రాయి బస్సు మీదికి విసురుతుంటే కాని వెనుకే చార్జీలు టాక్సుల రూపంలో పొంచివుంది పెద్ద ప్రమాదం మేలుకో చదువుకున్న మూర్ఖుడా!

5 కామెంట్‌లు:

  1. >>"మేలుకో చదువుకున్న మూర్ఖుడా!

    ఒక పక్క "మూర్ఖుడు" అంటూనే మరో పక్క "మేలుకో" అంటారేంటండి మీరు మరీనూ. :)

    రేప్పొద్దున, ఛార్జీలు పెంచినందుకు నిరసనగా ఏ ప్రతిపక్ష నాయకుడో ధర్నా చేస్తూ రెచ్చగొడితే అప్పుడు మళ్ళీ ఓ పది బస్సులు తగలెడతారు.

    రిప్లయితొలగించండి
  2. మంచి మాట చెప్పారు నాగప్రసాద్ గారు, ఎప్పటికి తెలుసుకుంటాడొ విద్యావంతుడు.
    మీ బ్లాగు చూసాను చాలా జ్ఙానాన్ని అందిస్తున్నారు మీరు మాబోటి అజ్ఙానులకు.

    రిప్లయితొలగించండి
  3. సరిగ్గా చెప్పారు నాగప్రసాద్ గారు

    రిప్లయితొలగించండి
  4. సరిగ్గా చెప్పారు నాగప్రసాద్ గారు

    రిప్లయితొలగించండి
  5. నూతన సంవత్సర శుభాకంక్షలు.:)
    "బ్లాగులోకంలో మంచి టపాలు - 2009"
    కోసం ఈ కింది లంకే చూడండి.
    http://challanitalli.blogspot.com/2009/12/2009.html

    రిప్లయితొలగించండి