28, డిసెంబర్ 2009, సోమవారం

ప్రేమ లేఖ కూడా ఇబ్బంది పెడుతుందా!

అవునండి నిజమే నేను మొదటిసారి వ్రాసిన ప్రేమ లేఖ మా వారిని చాల చాల ఇబ్బంది పెట్టిందిట అదెలాగో చదవండి మీకే తెలుస్తుంది:
మరే, మా పెళ్లి ఐన కొత్తలో నేను మా అత్తవారింటిలో, మా వారు భాగ్య నగరంలో, ఉండేవారం. అప్పుడు మా వారిని లేఖ వ్రాయమని
పదేపదే అడిగేదాన్ని , ఆయన నువ్వే వ్రాయి ముందు అన్నారు. నాకు చాల కోపం వచ్చింది. నా కోపాన్ని ప్రేమగా ఎలా చూపించానో
తెలుసా, లేఖ నేనే వ్రాసాను తన మాట విని కాని దాన్ని అందరి ముందు చదవలేని విధంగా. అందరి ముందు చదవరనుకోండి నేను
వ్రాసిన లేఖ కాని, మరీ బాత్రూంలో చదవరుగా! మరే, అలా డిసైన్ చేశా ! అబ్బా! సోది ఆపి చెప్పమంటారా ఎంచేసానో , ఏముందండి
హృదయాకారంలో పేపరు కత్తిరించి అందులో వ్రాసా! ఇక చూడాలి మావారి పాట్లు అది చదవడానికి ఆఫీసు లో చదివితే స్నేహితులు
మోసేస్తారు, ఇంట్లో చదివితే, కోతుల్లాంటి తమ్ముళ్ళు ఆట పట్టిస్తారు. ఇంకేం చేస్తారు బాత్రూం. ఉమాపతీ బత్రూమే గతి . అమ్మమ్మ!
ఎన్ని తిప్పలు పెట్టావు అని, అప్పట్నుంచి నేను పుట్టింటికి వెళ్ళిన, అత్తవారింటికి వెళ్ళిన తనే జాబు వ్రాస్తారు ఆలస్యం ఐతే నేను
ఏమి ప్రయోగం చేస్తానో అని!

6 కామెంట్‌లు: